“అఖండ” క్లారిటీపై ఎదురు చూపులు..!

Published on Oct 14, 2021 11:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం “అఖండ”. మాస్ ఆడియెన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ ఈ ఏడాది దీపావళి కానుకగా వస్తుందని టాక్ గత కొన్ని రోజులు నుంచి వినిపిస్తుండగా ఇప్పుడు దానిపై క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు వరకు ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ సింగిల్ మాత్రమే వచ్చింది ఎప్పుడో కొన్ని అప్డేట్స్ వచ్చాయి. కానీ మళ్ళీ రీసెంట్ గా వేరే అప్డేట్స్ రాలేదు. పైగా ఇప్పుడు కేవలం ఇంకొక అర్ధ నెల మాత్రమే సమయం ఉండడంతో ఈ చిత్రం ఇప్పుడు దీపావళి కానుకగా అయినా వస్తుందా రాదా అన్న డౌట్స్ మొదలవుతున్నాయి. అందుకే ఆ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఏదో మేకర్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :