“ఆచార్య” ట్రైలర్ కోసం అంతా వెయిటింగ్.!

“ఆచార్య” ట్రైలర్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Apr 9, 2022 7:02 AM IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య” సినిమా కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. అయితే గత వారమే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కోసం మేకర్స్ అడక్కుండానే ఒక అప్డేట్ ని అందించారు.

కానీ మళ్ళీ ఇప్పుడు సైలెంట్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఉంటే ఈ ఏప్రిల్ 10నే రిలీజ్ అని టాక్ ఉండగా ఒకవేళ అదే అయితే అప్డేట్ అయినా వస్తుందని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ మెగా సెన్సేషన్ ట్రైలర్ పై అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు