నేడు బాలయ్య ఆగమనం కోసం అంతా వెయిటింగ్.!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి తో అయితే తన కెరీర్ లో 108వ సినిమా చేస్తుండగా రీసెంట్ గానే బాలయ్య నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చింది. వెండితెర మీద అలాగే నెక్స్ట్ ఓటిటి లో కూడా అదరగొట్టిన తాను మొదటిసారి సారిగా బుల్లితెరపై కూడా తన హోస్టింగ్ తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి స్టార్ స్పోర్ట్స్ సంస్థ తో తెలుగు వెర్షన్ కి గాను బాలయ్య తన కామెంట్రీ అందించేందుకు ఓకే చెప్పగా ఇక ఎట్టకేలకు ఈరోజు అవైటెడ్ ఐపీఎల్ మ్యాచ్ లు స్టార్ట్ అవుతుండడంతో బాలయ్య ఈరోజు తన ఫస్ట్ కామెంట్రీ ని అందించడానికి రెడీ అయ్యారు. ఆల్రెడీ ఛానెల్స్ లో అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే తాను జాయిన్ అవుతారని అంటున్నారు. మరి దీనితో స్మాల్ స్క్రీన్ పై బాలయ్య ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అని క్రికెట్ మరియు నందమూరి అభిమానులు ఈరోజు అత్యంత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు.

Exit mobile version