‘డానియల్’ మాస్ అప్డేట్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Dec 14, 2021 8:01 am IST

ఇప్పుడు టాలీవుడ్ లో మంచి అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉన్న భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ గా రానా డానియల్ శేఖర్ గా నటిస్తున్నారు. మరి ఒక్కో పాత్రకి కూడా స్పెషల్ మోడ్ ఈ చిత్రంలో ఉంది.

అయితే మరి ఈరోజు రానా బర్త్ డే కావడంతో భీమ్లా నాయక్ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ డానియల్ పై ఉంటుందని బజ్ వినిపిస్తూ వస్తుంది. ఇప్పుడు అంతా ఆ మాస్ అప్డేట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇందులో రిలీజ్ డేట్ కి సంబంధించి ఏమన్నా కన్ఫర్మేషన్ మళ్ళీ ఉంటుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :