“వాల్తేరు వీరయ్య”..అతడి స్పీచ్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Jan 28, 2023 6:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ మాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అయితే పలువురికి గట్టి సమాధానం ఇచ్చి అదిరే లెవెల్ బాక్సాఫీస్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ తో ఈరోజు మేకర్స్ భారీ సక్సెస్ మీట్ లో అరేంజ్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ ఈవెంట్ లో అయితే ఓ వ్యక్తి స్పీచ్ కోసం మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అతడు మరెవరో కూడా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. తాను ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తుండగా లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా మెగా ఫ్యాన్స్ మిస్ అయ్యిన మెగా వైబ్స్ కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ స్పెషల్ ఈవెంట్ లో రామ్ చరణ్ స్పీచ్ అనే అంశం కూడా ఇప్పుడు అభిమానుల్లో మంచి ఆసక్తిగా మారింది. మరి చరణ్ అయితే ఎలాంటి విషయాలు పంచుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :