లేటెస్ట్..”పుష్ప” హిందీ వెర్షన్ పై మరింత ఆసక్తి..!

Published on Dec 7, 2021 7:05 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప”. చిత్ర యూనిట్ ఎప్పుడు నుంచో పడుతున్న కష్టం.. ఆడియెన్స్ ఎన్నో రోజులు నుంచి పడుతున్న ఎదురు చూపులకి ఆల్ మోస్ట్ పెద్ద సమాధానం లా ఇంటెన్స్ ట్రైలర్ ని మేకర్స్ నిన్న రిలీజ్ చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ కూడా వస్తుంది.

మరి ఇదిలా ఉండగా మొదట ఐదు భాషల్లో కూడా ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేశారు కానీ తర్వాత హిందీ వెర్షన్ ని మాత్రం ఇంకా హోల్డ్ లోనే అయితే ఇది తెలుగు వెర్షన్ చూశాక హిందీ ట్రైలర్ పై మరింత ఆసక్తి నెలకొంది. దీనిని కాస్త డిఫరెంట్ గా కట్ చేస్తారా? లేక మిగత భాషల్లానే కట్ చేస్తారా అనేవి మరింత ఆసక్తి రేవుతున్నాయి మరి హిందీ ట్రైలర్ ని ఎలా డిజైన్ చేసారో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :