పవన్, నానీల స్పీచ్ కోసం అంతా ఓ రేంజ్ లో వెయిటింగ్..!

Published on Jun 9, 2022 7:10 am IST

మన టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర యంగ్ హీరోల సినిమాలకు హాజరు కావడం అనేది చాలా అరుదుగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా లేటెస్ట్ మన టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా చేసిన అవైటెడ్ సినిమా “అంటే సుందరానికి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారు అనే మాట ఒక్కసారిగా మంచి హైప్ ని తీసుకొచ్చింది. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ టైం లో పవన్ మరియు నానీ అభిమానుల మధ్య మంచి సాన్నిహిత్యం నెలకొంది.

ఓ అంశం విషయంలో ఇరు హీరోలు బలంగా నిలబడడంతో అక్కడ నుంచి ఈ కాంబో టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు హీరోలు ఎప్పుడూ ఒకే స్టేజ్ పంచుకున్నది లేదు. కానీ ఫైనల్ గా ఆ రోజు ఇప్పుడు రావడంతో అసలు ఈరోజు ఈ ఇద్దరూ ఏం మాట్లాడుతారు అనే అంశం టాలీవుడ్ శ్రేణుల్లో ఆసక్తిగా మారిపోయింది. మరి అసలు ఈ ఇద్దరు హీరోలు ఏం మాట్లాడుతారో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగక తప్పదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :