పవన్ అప్డేట్ పై ఆసక్తి..!

పవన్ అప్డేట్ పై ఆసక్తి..!

Published on Dec 11, 2022 7:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అలాగే నటించనున్న కొత్త సినిమాలపై అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో మంచి ఆసక్తికరమైన వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గత వారమే పవన్ నుంచి ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ కాగా దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ సెట్టయ్యింది. ఇక ఈ సినిమా స్ట్రెయిట్ ప్రాజెక్ట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ లోఅనందం కూడా అంతా ఇంతా కాదు.

కానీ మరో చిత్రం దర్శకుడు హరీష్ శంకర్ తో అనౌన్స్ కావాల్సి ఉండడం ఈ చిత్రం రీమేక్ అని టాక్ రావడంతో అయితే పవన్ ఫ్యాన్స్ లో గత సినిమాకి ఎంత ఎగ్జైట్మెంట్ వచ్చిందో దీని ఆ డిజప్పాయింట్ మెంట్ కూడా వచ్చింది. కాకపోతే ఇది రీమేక్ అవునా కాదా అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఈరోజు రానున్న అధికారిక అప్డేట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. మరి దీనితో అయితే ఈ చిత్రం రీమేక్ సినిమానా కాదా అనేది తేలిపోతుంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు