పవన్ ఈ ఇష్యూ పై ఏం మాట్లాడుతాడా అని ఆసక్తి..!

Published on Sep 25, 2021 7:20 pm IST


టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తుండడంతో పాటుగా తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి సన్నద్ధం అయ్యిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు పవన్ రాకపైనే అంతా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఏపీలో నెలకొన్న టికెట్ రేట్స్ గందరగోళం అనేది పవన్ నటించిన చిత్రం “వకీల్ సాబ్” నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఇక అక్కడ నుంచి ఏపీలో అన్ని సినిమాలు కూడా నార్మల్ రేట్స్ తోనే అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ అంశమే టాలీవుడ్ కి గట్టి దెబ్బలా మారి పలు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అయోమయంలో పడేసింది. దీనితో కొన్ని సినిమాలు ఓటిటి బాట పట్టినవి కూడా ఉన్నాయి.

అయితే ఈ ఇష్యూ పైనే రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని మెగాస్టార్ చిరంజీవి కూడా వేదికలపై అడ్రెస్ చెయ్యడం జరిగింది. దీనితో ఈరోజు రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ దీనికి సంబంధించి ఏమన్నా మాట్లాడుతాడా లేక జస్ట్ సినిమా కోసమే మాట్లాడుతారా అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి మాత్రం ఈరోజు పవన్ ఇచ్చే స్పీచ్ కోసం మాత్రం చాలా మందే ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :