‘పూనకాలు లోడింగ్’ కోసం అంతా వెయిటింగ్.!

‘పూనకాలు లోడింగ్’ కోసం అంతా వెయిటింగ్.!

Published on Dec 30, 2022 9:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ మహారాజ్ రవితేజ కూడ మరో కీలక పాత్రలో తనకి జోడిగా కేథరిన్ నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని వెనక్కి తీసుకురావడమే పరమావధిగా అనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ పాటలు కానీ భారీ ఎత్తున హైప్ ని సెట్ చేయగా.

ఇప్పుడు అయితే అంతా “పూనకాలు లోడింగ్ సాంగ్” కోసం అత్యంత ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిన్న మెగాస్టార్ మరియు రవితేజాలపై రిలీజ్ చేసిన పోస్టర్ ఒక్కసారిగా హైప్ ని పెంచగా ఈరోజు వచ్చే ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది మంచి ఎగ్జైటింగ్ గా మారింది. మరి ఈ సాంగ్ కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్ లు కూడా వేయగా అభిమానులు మాత్రం ఈ సాంగ్ విజువల్స్ చాలా కాలం తర్వాత చిరు రవితేజ ఆన్ స్క్రీన్ ట్రీట్ కోసం చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు