ప్రభాస్ బర్త్ డే అప్డేట్స్ కోసం అంతా వెయిటింగ్.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ప్రతి దానిపై కూడా అనేక అంచనాలు ఉన్నాయి. ఇక మన స్టార్ హీరోల బర్త్ డే లు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ కి ఆరోజు భారీ ట్రీట్ లు ఖాయం అలాంటిది ప్రభాస్ లాంటి ఓ స్టార్ బర్త్ డే వస్తే అది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ గా మారుతుంది. మరి ప్రభాస్ బర్త్ డే కానుకగా వచ్చే అప్డేట్స్ ఇప్పుడు మంచి ఆసక్తిగా మారాయి.

ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న చిత్రాల్లో అయితే ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యి, సెట్స్ మీద ఉన్నవి మూడు సినిమాలు ఉన్నాయి. మరి వీటి నుంచి అయితే అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అయితే ఆదిపురుష్. సలార్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అయితే ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ రెండు చిత్రాలు నుంచి ఎలాంటి ట్రీట్ లు అనౌన్స్ చేస్తారో అనేది చూడాలి.

Exit mobile version