“కల్కి” ఫుల్ సాంగ్ కోసం అంతా వెయిటింగ్.!

“కల్కి” ఫుల్ సాంగ్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Jun 16, 2024 7:06 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు అంచనాలు మరింత స్థాయిలో పెంచుకున్న ఈ చిత్రం కోసం అంతా ఆసక్తి గా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో మేకర్స్ సాలిడ్ ఫస్ట్ సింగిల్ ని అది కూడా గ్రాండ్ ప్రమోషనల్ సాంగ్ గా అనౌన్స్ చేయడం పైగా ప్రభాస్ ఈ ప్రమోషనల్ సాంగ్ లో పాల్గొనడం ఆసక్తి గా మారింది.

ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఫుల్ సాంగ్ ని మేకర్స్ వదలబోతున్నారు. దీనితో అంతా ఈ ఫుల్ పాట ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు ఇంకా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కూడ ఏ రేంజ్ లో ఉంటుందో అని చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు నటించగా వైజయంతి మూవీస్ నిర్మాణం వహించారు. అలాగే ఈ జూన్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు