ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి.!

Published on Oct 9, 2021 1:00 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సహా మరిన్ని ఆసక్తికర భారీ ప్రాజెక్ట్ లను టేకప్ చేస్తూ అందనంత ఎత్తుకి తన మార్కెట్ ని విస్తరిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ప్రభాస్ రీసెంట్ గానే తన కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా 25వ ది సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో “స్పిరిట్” అనే సినిమా అనౌన్స్ చేసి భారీ లెవెల్ హైప్ ని తెచ్చుకున్నాడు.

అయితే తన లైనప్ లో ప్రభాస్ 24వ సినిమాని స్కిప్ చేసి 25వ సినిమాని అనౌన్స్ చెయ్యడం ఆసక్తిగా మారగా ఇప్పుడు ఆ 24వ సినిమాకు దర్శకుడు ఎవరు అన్న ప్రశ్న మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమాకి పలువురు నిర్మాతలు పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఫైనల్ అవుతారు అనేది అసలు అంశం. అందుకే ఈ భారీ ప్రాజెక్ట్ ని ప్రభాస్ ఎవరితో ప్లాన్ చేస్తాడా అని ప్రభాస్ అభిమానుల్లో సహా మూవీ లవర్స్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :