“పుష్ప” హిందీ వెర్షన్ పై క్లారిటీ కోసం అంతా వెయిటింగ్.!

Published on Dec 18, 2021 9:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప ది రైజ్” నిన్ననే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యింది. మరి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సినిమా పడినా కొన్ని భాషల్లో మాత్రం పుష్ప కి కన్ఫ్యూజన్ పరిస్థితులు ఎదురవ్వక తప్పలేదు. అయితే ముఖ్యంగా పుష్ప సినిమా రిలీజ్ లో అంతా ఎక్కువగా హిందీ రిలీజ్ రెస్పాన్స్ కోసమే ఆసక్తిగా ఎదురు చూసారు.

బన్నీ మొట్ట మొదటి సారిగా చేసిన పాన్ ఇండియన్ సినిమా ఇది. పైగా అల్లు అర్జున్ కి హిందీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ఉన్నా థియేట్రికల్ గా ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనే అంశం పుష్ప తోనే మొదలు కానుంది. అయితే అక్కడ సరైన ప్రమోషన్స్ జరగలేదు అని అందరికీ తెలిసిందే.

దీనితో ఫస్ట్ డే నుంచే సినిమా అక్యుపెన్సీ పరంగా మిక్సిడ్ టాక్ వినిపిస్తూ వచ్చింది. తర్వాత మళ్ళీ ఆడియెన్స్ వస్తున్నారు అని టాక్ వచ్చినా ఇవన్నీ ఏ మేరకు నిజమో తేల్చాల్సింది వసూళ్లు మాత్రమే. అందుకే ఈ సినిమా హిందీ వెర్షన్ ఏ మేర హిట్టయ్యిందో తెలియాలి అంటే వసూళ్లు క్లారిటీ బట్టే తెలియాలి మరి దీని కోసమే ఇప్పుడు అంతా వెయిట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :