“రాధే శ్యామ్” ఎక్స్ట్రా డోస్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Nov 26, 2021 11:00 pm IST


వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ సినిమాల్లో దర్శకుడు రాధా కృష్ణ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే లు హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా “రాధే శ్యామ్” కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నెమ్మదిగా ఒక్కో అప్డేట్ తో బజ్ ను పెంచుకుంటుంది. అయితే ఈ డోస్ మాత్రం ఏమాత్రం సరిపొవట్లేదని తెలుస్తుంది.

ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రమోషన్స్ ని స్టార్ట్ చెయ్యాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆల్రెడీ రేస్ లో ఉన్న అన్ని సినిమాలు ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేశాయి. దీనితో రాధే శ్యామ్ ప్రమోషన్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా కాస్త టైం ఉన్నట్టు తెలుస్తుంది.

అన్నీ కరెక్ట్ టైం లోనే ఈ సినిమాకి సంబంధించి పర్టిక్యులర్ గా స్టార్ట్ అవుతాయట. మరి అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా గ్యాప్ ఉండకపోవచ్చేమో.. అని చెప్పాలి. ప్రస్తుతం టోటల్ హిందీ ఆల్బమ్ ని ఫినిష్ చేస్తున్నట్టు ఉన్నారు. అందుకే జస్ట్ ఇంకొన్ని రోజుల్లో రాధే శ్యామ్ యూనిట్ కూడా సూపర్ ఆక్టివ్ అవ్వనున్నారు.

సంబంధిత సమాచారం :