“రాధే శ్యామ్” నుంచి ఈ కీలక అనౌన్స్మెంట్ కోసం అంత వెయిటింగ్!

Published on Jan 29, 2022 7:07 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ రాధా కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్”. ప్రభాస్ అభిమానులు ఎపుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా రిలీజ్ ఈ జనవరిలో ఉండాల్సింది కానీ కరోనా వల్ల ఆగిపోయింది.

ఇక ఈ గ్యాప్ లో ఈ సినిమాపై అనేక ఊహాగానాలు ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతుండగా సినీ వర్గాలు ఈ సినిమా టెక్నీషియన్స్ మాత్రం ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని చెబుతున్నారు. మరి ఈ విడుదల ఏదో ఎప్పుడు అవుతుంది ఆ డేట్ ఎప్పుడా అనే అనౌన్స్మెంట్ కోసం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతానికి అయితే మార్చ్ నెల లోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని టాక్ ఉండగా ఏదో ఒకటి దానిపై అధికారిక ప్రకటన కోసం అయితే అంతా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :