“రాధే శ్యామ్” ట్రైలర్ కోసం సర్వత్రా ఆసక్తి..!

Published on Dec 23, 2021 7:06 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్”. తన ఒక్కో సినిమా అనంతరం చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్లో అనేక అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాధా కృష్ణ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ భారీ సినిమా ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈరోజే ఎంతో ఘనంగా రిలీజ్ కానున్నాయి. అయితే ఈరోజు వచ్చేయడంతో అంతా రాధే శ్యామ్ ట్రైలర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది వరకు వచ్చిన పాటలు టీజర్ సినిమాపై మరింత ఆసక్తి రేపగా ట్రైలర్ ఎలా ఉంటుంది అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఆరోజు ఎలానో వచ్చేసింది. ఇంకొన్ని గంటల ఆగితే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ ద్వారా అభిమానులు చేతులు మీదగా ఈ ట్రైలర్ విడుదల అవుతుంది. మరి చూడాలి ఇదెంత మ్యాజికల్ గా ఉంటుందో. ఇక ఈ భారీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :