ఇప్పుడు ఆసక్తిగా మారిన “వాల్తేరు వీరయ్య” రిలీజ్.!

Published on Dec 6, 2022 8:01 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం తెలిసిందే. మరి మెగా ఫ్యాన్స్ సహా ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం షూటింగ్ అయితే ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు రిలీజ్ కోసం అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాతో పాటుగా ఆల్రెడీ సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకోగా ఇక మిగిలి ఉంది మెగాస్టార్ సినిమా ఒకటే కావడంతో అయితే ఇప్పుడు అంతా వీరయ్య డేట్ కోసం చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రం సోలో రిలీజ్ గానే ఉంటుందని టాక్ ఉంది. మరి దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :