అందరి చూపు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వైపు

Published on Mar 2, 2023 2:30 am IST


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం అందుకోవడంతో పాటు గ్లోబల్ గా అనేక దేశాల ఆడియన్స్ ని సైతం అలరించింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ పలు అంతర్జాతీయ అవార్డులని సైతం దక్కించుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవడంతో ఒక్కసారిగా భారతీయ సినీ ఆడియన్స్, మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. మార్చి 13న లాస్ ఏంజెల్స్ లో జరుగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది.

ఇక ఇప్పటికే ఈ వేడుకల కోసం రామ్ చరణ్ అమెరికా చేరుకోగా మరొక నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ తో పాటు ఇతర ఆర్ఆర్ ఆర్ సభ్యులు వెళ్లనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఒకవేళ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ కనుక దక్కినట్లయితే నిజంగా అది అతిపెద్ద అఛీవ్మెంట్ అని, ఇప్పటికే దర్శకుడు రాజమౌళి తో పాటు హీరోలు ఎన్టీఆర్, చరణ్ లకు గ్లోబల్ గా ఎంతో గుర్తింపు రావడంతో, ఆ అవార్డు కనుక దక్కినట్లయితే వారికి అటు క్రేజ్ మరింతగా విశ్వవ్యాప్తం అవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :