“తండేల్” ట్రైలర్ పైనే అంచనాలు!

“తండేల్” ట్రైలర్ పైనే అంచనాలు!

Published on Jan 28, 2025 8:02 AM IST

అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. మరి మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే ఈరోజు రాబోతుంది.

మరి ఈ ట్రైలర్ క్లిక్ అవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అక్కినేని అభిమానులు సహా నార్మల్ యువత కూడా ఈ సినిమా ట్రైలర్ పట్ల ఆసక్తిగా ఉండగా వారి అంచనాలు ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది ఈ సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు ఆగితే తెలిసిపోతుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఈ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు