అభిరాం ‘అహింస’ పై అందరిలో ఆసక్తి

Published on Jun 1, 2023 11:36 pm IST

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న యువ హీరో అభిరాం. సురేష్ బాబు చిన్నకొడుకైన అభిరాం తొలిసారిగా అహింస మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అవుతున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ గ్రాండ్ గా నిర్మించారు. గీతికా హీరోయిన్ గా నటించిన అహింస నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రలు అన్ని కూడా ఆకట్టుకుని ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించిన ఈ మూవీ లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కాగా ఈ మూవీ గ్రాండ్ గా రేపు అనగా జూన్ 2న థియేటర్స్ లో రిలీజ్ కానుండడంతో సినిమా ఎలా ఉంటుందో, అలానే అభిరాం నటుడిగా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా తొలి సినిమా అయినప్పటికీ కూడా అభిరాం బాగా నటించాడని, అలానే సినిమా కూడా తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం :