‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ ఫేం అవికా గొర్. తొలి సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. తన వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా సీరియల్స్ కు ప్రాధాన్యం ఇచ్చింది. తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగులో అవికా గొర్ నటించిన సెకండ్ మూవీ ‘లక్ష్మీ … రావే మాంటికి’ ఈ శుక్రవారం విడుదలవుతుంది. అందరి చూపు ఈ సినిమా వైపే.
‘లక్ష్మి… రావే మా ఇంటికి’ సినిమాతో, మరో హిట్ కొడుతుందా..? హిట్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. తొలి సినిమా తరహాలోనే ‘లక్ష్మి… రావే మా ఇంటికి’ సినిమాలో కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించనుంది. గ్లామర్ జోలికి వెళ్ళకుండా కేవలం పెర్ఫార్మన్స్ పైనే దృష్టి పెట్టింది.
ఇప్పటివరకూ విడుదలైన ‘లక్ష్మి… రావే మా ఇంటికి’ ప్రోమోలు, టీజర్లకు మంచి స్పందన లభించింది. ‘ఊహలు గుసగుసలాడే, ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాల తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా విజయం తర్వాత అవికా గొర్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తుందో..? లేక సీరియల్స్ వైపు మొగ్గు చూపుతుందో..?
