ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమా డ్రాగన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా డెడికేషన్ తో తారక్ ఈ బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ చేశాక ఫ్యాన్స్ తో కలిసే అవకాశం చాలా తక్కువగా వచ్చింది. కానీ ఫైనల్ గా తన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆ మూమెంట్ ని తీసుకొచ్చారు.
రాజమౌళి కాంపౌండ్ ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కించిన అవైటెడ్ సినిమా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడు మొత్తం సెట్ చేశారు. నేడు గ్రాండ్ గా జరగనున్న ఈవెంట్ లో తారక్ స్పీచ్ పైనే మంచి ఆసక్తి నెలకొంది. తారక్ స్పీచ్ లకి ఫ్యాన్స్ లో సెపరేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దీనితో ఈ సినిమా కోసం ఫహాద్ కోసం అలాగే తన జక్కన్న కోసం ఏం మాట్లాడతాడు అనేది మంచి ఇంట్రెస్టింగ్ గా మారింది. సో అందరి కళ్ళు ఈ ఈవెంట్, తారక్ పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా దక్షిణాది భాషల్లో ఈ అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
