Jana Nayagan: ట్రైలర్ పైనే అందరి కళ్ళు.. బాలయ్య సినిమానేనా?

Jana-Nayakudu

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘జన నాయగన్’ (Jana Nayagan). తెలుగులో జన నాయకుడు గా వస్తున్న ఈ సినిమా విజయ్ చివరి సినిమా కాగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇవాళ ఈ సినిమా తాలూకా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు. మరి ఈ ట్రైలర్ పైనే అందరి కళ్ళు పడ్డాయి.

మెయిన్ గా తెలుగు ఆడియెన్స్..

జన నాయకుడు (Jana Nayagan) అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా బాలయ్య, అనీల్ రావిపూడి సూపర్ హిట్ భగవంత్ కేసరి (Bhagavanth Kesari) రీమేక్ అని టాక్ వచ్చింది. కానీ దానిని మేకర్స్ కన్ఫర్మ్ చేయకుండానే నెట్టుకొచ్చారు. ఒకవేళ అదే అయితే మళ్ళీ దాన్ని తమిళ్ లో తీసి మళ్ళీ తెలుగులో రిలీజ్ చేయడం ఏంటా అని తెలుగు ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి ఈరోజు వచ్చే ట్రైలర్ సమాధానం ఇస్తుంది.

ఆల్రెడీ చాలా పోలికలు..

భగవంత్ కేసరి లో కాజల్, శ్రీలీల ఉంటే ఇందులో పూజా హెగ్డే మమిత బైజు ఉన్నారు. ఈ రెండు పాత్రలకి ఎంత ఇంపార్టెన్స్ భగవంత్ కేసరిలో ఉందో ఇందులో కూడా అంతే కనిపిస్తుంది. ఒరిజినల్ గా హీరో, హీరోయిన్ కి డ్యూయెట్ లేదు, ఇందులో కూడా లేదు. పైగా స్టైలింగ్, హీరో రెండు లుక్స్ కూడా మ్యాచ్ కావడం కనిపిస్తుంది. సో ఇలా చాలానే పోలికలు ఉన్నాయి.

Exit mobile version