ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ పై అందరిలో భారీ ఆసక్తి

Published on May 19, 2023 12:26 am IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 20న బర్త్ డే జరుపుకుంటుండగా ఒక రోజు ముందే అనగా మే 19న రాత్రి 7 గం. 2 ని. లకు తమ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు ఎన్టీఆర్ 30 మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటన అందించింది. కొరటాల శివ తీస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆకట్టుకోవడంతో రేపు రానున్న ఫస్ట్ లుక్ మరింతగా అదిరిపోనుందని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ పెద్ద సక్సెస్ అందుకోవడంతో తప్పకుండా ఎన్టీఆర్ 30 మూవీ అంతకు మించి భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. కాగా ఈ మూవీకి దేవర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 ఏప్రిల్ 5న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :