‘పెద్ది’ గ్రాండ్ ఈవెంట్ పైనే అందరి కళ్ళు.. ‘పుష్ప 2’ ని మ్యాచ్ చేస్తుందా!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా పెద్ది కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ భారీ ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నేడు భోపాల్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ జరుపుకుంటుంది. రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్ అలానే సాంగ్ లాంచ్ కూడా ఇక్కడ జరగనున్నాయి. అయితే ఈ భారీ ఈవెంట్ పైనే అందరి కళ్ళు పడ్డాయి.

మేకర్స్ ఊహించని రేంజ్ లో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఓ లక్ష మంది జనాభా అక్కడ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం ఉందని మరో షాకింగ్ బజ్ కూడా ఉంది. ఇది నిజం అయితే మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పాట్నా ఈవెంట్ ని మ్యాచ్ చేసినట్టే అని చెప్పాలి. ఆ ఈవెంట్ ఊహించని సక్సెస్. నార్త్ ఇండియాలో ఓ టాలీవుడ్ హీరో డామినేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది అని బన్నీ చూపించాడు. ఇప్పుడు ఇదే టాస్క్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకు వచ్చింది. సో ఈ ఈవెంట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version