అన్ స్టాపబుల్ 2 విత్ NBK – పవన్ ఎపిసోడ్ పై సర్వత్రా ఆసక్తి

అన్ స్టాపబుల్ 2 విత్ NBK – పవన్ ఎపిసోడ్ పై సర్వత్రా ఆసక్తి

Published on Dec 27, 2022 6:17 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ప్రస్తుతం ప్రసారం అవుతున్న క్రేజీ ఎంటర్టైన్మెంట్ షో అన్ స్టాపబుల్ 2 విత్ NBK. గత కొన్ని వారాలుగా ఎంతో ఆకట్టుకుంటూ పలు ఎపిసోడ్స్ కొనసాగిన ఈ షోకి నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా విచ్చేయనున్నారు. హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో కలిసి పవన్ ఈ ఎపిసోడ్ కి విచ్చేసినట్లు తెలుస్తోంది.

నేడు ఉదయం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభం అయిన ఈ ఎపిసోడ్ పై అందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటసింహం నందమూరి బాలకృష్ణ కలిసి చేస్తున్న షో కావడంతో బాలకృష్ణ ఎటువంటి సరదా ప్రశ్నలు అడుగుతారు, దానికి పవన్ దానికి ఏ విధంగా సమాధానం ఇస్తారు వంటి ఆసక్తి అందరిలో ఉంది. కాగా ఈ ఎపిసోడ్ ని 2023 సంక్రాంతి సందర్భంగా ఆహా వారు ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఆహా టీమ్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు