అందరి చూపులు VD12 టైటిల్, టీజర్ పైనే..!

అందరి చూపులు VD12 టైటిల్, టీజర్ పైనే..!

Published on Feb 12, 2025 7:02 AM IST

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ VD12 వర్కింగ్ టైటిల్ తో తెరకేక్కుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ అయితే ఇవ్వనున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ నేడు రివీల్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. వివిధ భాషల్లో పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో ఈ టీజర్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.

తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణ్ బీర్, తమిళ్ లో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో ఇప్పుడు అందరి చూపులు ఈ టీజర్ పైనే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు