“వాల్తేరు వీరయ్య” సాంగ్ అవుట్ పుట్ పై ఆసక్తి.!

“వాల్తేరు వీరయ్య” సాంగ్ అవుట్ పుట్ పై ఆసక్తి.!

Published on Nov 23, 2022 8:00 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మరి మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై సాలిడ్ హైప్ కూడా నెలకొంది. ఇక ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని అయితే మేకర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేయగా నెక్స్ట్ ఈ సాంగ్ ప్రోమో కూడా బయటకి వచ్చింది.

కానీ దీనికి అయితే దేవిశ్రీ అన్ని ఫస్ట్ సింగిల్స్ లానే మిక్సిడ్ రెస్పాన్స్ నే రాగా ఇప్పుడు ఈరోజు వచ్చే ఫుల్ సాంగ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రోమో కన్నా ఫుల్ సాంగ్ సాలిడ్ గా ఉంటుంది అని దాని అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది అని సినీ వర్గాల్లో ఈ సాంగ్ పై ఉన్న సమాచారం. అలాగే డీఎస్పీ ఫ్యాన్స్ కూడా అదే నమ్మకంలో ఈ ఫుల్ సాంగ్ బాస్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు సాయంత్రం వచ్చే ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు