“ఖైదీ 2” అన్ని ఇష్యూస్ కి లైన్ క్లియర్..ఇంతకీ ఏం జరిగిందంటే!

Published on Feb 13, 2022 11:01 pm IST

కోలీవుడ్ సహా మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న హీరోల్లో కార్తీ కూడా ఒకడు. అయితే తన కెరీర్ లో డౌన్ వచ్చి సరైన హిట్స్ లేవు అనే సమయంలో సైలెంట్ గా వచ్చి వైలెంట్ హిట్ గా నిలిచిన చిత్రం “ఖైదీ”. కోలీవుడ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ లోకేష్ కనగ్ రాజ్ పేరు కూడా మన టాలీవుడ్ బాగా వినిపించింది ఈ సినిమా తోనే.. అయితే ఈ సినిమా తెలుగు సహా తమిళ్ లో భారీ హిట్ కాగా ఈ హిట్ కోసం కొన్నాళ్ళు అంతా మాట్లాడుకున్నారు.

పైగా ఈ సినిమాలో లాస్ట్ చేసి సీక్వెల్ కి కూడా లీడ్ వదలడంతో అంతా పార్ట్ 2 కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూసారు. మరి ఇప్పుడు ఫైనల్ గా “ఖైదీ 2” చేసుకోడానికి లైన్ క్లియర్ అయ్యినట్టు తెలుస్తుంది. అసలు ఇంతకీ ఈ సినిమా విషయంలో ఏం జరిగిందంటే.. ఈ సినిమా హిట్ అయ్యి ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యే సూచనలు కనిపించే టైం లో ఈ కథ నాది అంటూ ఎవరో కోర్ట్ లో అపీల్ చెయ్యడం జరిగింది.

దీనితో ఆ సినిమాకి సీక్వెల్, రీమేక్ అనే మాటలు అక్కడితో ఆగిపోయాయి. ఫైనల్ గా ఇప్పుడు లోకేష్ కి గుడ్ న్యూస్ దక్కినట్టుగా కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. న్యాయం ఒరిజినల్ కథ రాసుకున్న లోకేష్ కనగ్ రాజ్ వైపే ఉందని ఇక మీద తన సీక్వెల్ కి రీమేక్ కి ఎవరు అడ్డు చెప్పకూడదని న్యాయస్థానం వారు తుది తీర్పుని అందించారు. ఇలా ఫైనల్ గా “ఖైదీ 2” కి అన్ని ఇష్యూస్ క్లియర్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :