ఆల్ మోస్ట్ “చరణ్ 16” ఆగిపోయినట్టేనా.?

ఆల్ మోస్ట్ “చరణ్ 16” ఆగిపోయినట్టేనా.?

Published on Nov 1, 2022 7:03 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబోలో ఓ భారీ సినిమా చేస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇరువురు కెరీర్ లో కూడా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 15వ సినిమాగా తెరకెక్కుతుండగా దీనిపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా లైన్ లో ఉండగా నెక్స్ట్ ప్రాజెక్ట్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో అయితే 16వ ప్రాజెక్ట్ గా ఇంకో భారీ సినిమాని అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

మరి ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ పై కొన్నాళ్ల నుంచి ఆగిపోయినట్టు పలు రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ రూమర్స్ నుంచి ఆల్ మోస్ట్ నిజంగానే ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే అంతే కాకుండా చరణ్ 16 ఎవరితో ఉంటుంది అని ఇతర అంశాలపై అతి త్వరలోనే క్లారిటీ రానున్నట్టు కూడా తాల్. సో మొత్తానికి అయితే చరణ్ నెక్స్ట్ విషయంలో కూడా మంచి ఆసక్తి ఇప్పుడు నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు