రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ను సొంతం చేసుకున్న “మంచి రోజులు వచ్చాయి”

రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ను సొంతం చేసుకున్న “మంచి రోజులు వచ్చాయి”

Published on Nov 3, 2021 4:00 PM IST

సంతోష్ శోభన్ మరియు మెహ్రిన్ లు హీరో హీరోయిన్ లుగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్ మరియు ఎస్కేఎన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ బజ్ ను సొంతం చేసుకుంది. పెయిడ్ ప్రీమియర్ షోస్ కి మంచి బుకింగ్స్ వస్తున్నాయి. అదే విధంగా పేటిఎమ్ మరియు బుక్ మై షో లలో కూడా అడ్వాన్స్ బుకింగా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక ఈ చిత్రానికి ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లు సైతం విషెస్ తెలపడం తో సినిమా పై ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది.

వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, అజయ్ ఘోష్, ప్రవీణ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు