సర్వత్రా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఎనిమి..!

Published on Nov 6, 2021 1:58 am IST


విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం ఎనిమి. ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు నవంబర్ 4 వ తేదీన వచ్చింది. అయితే కేవలం తమిళం లో మాత్రమే కాకుండా, ఈ చిత్రానికి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది.

ఎనిమి చిత్రానికి IMDb 9.1 రేటింగ్ ఉండటం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం లో మృణాళిని రవి మరియు మమతా మోహన్ దాస్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామ్ సి. ఎస్ అందించారు.

సంబంధిత సమాచారం :