“బ్రో” ఫస్ట్ లుక్ కి ఆలోవర్ అదిరే రెస్పాన్స్.!

Published on May 19, 2023 6:58 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ చిత్రం “బ్రో ది అవతార్”. అయితే సముద్రకని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ తన పోర్షన్ ని కంప్లీట్ చేసుకోగా లేటెస్ట్ గా మేకర్స్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టర్ కి యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందరి నుంచి రావడం విశేషం.

ముఖ్యంగా మొదట్లో ఇదొక రీమేక్ అని డిజప్పాయింట్మెంట్ వ్యక్తం చేసిన ఫ్యాన్స్ సైతం ఇప్పుడు ఈ బ్రో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అయితే మేకర్స్ మాత్రం అదిరే మార్పులు చేర్పులు చేసి సాలిడ్ బజ్ ని సినిమాపై ఇప్పుడు రాబట్టుకున్నారు అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ లు నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :