ఓవర్సీస్ లో “ఆచార్య” గ్రాండ్ రిలీజ్ కి ఆల్ సెట్.!

Published on Apr 13, 2022 12:11 pm IST

మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దర్శకుడు ఓవర్సీస్ లో ఈ సినిమా రిలీజ్ కి గాను అన్ని పనులు సెట్ చేసినట్టుగా అక్కడి డిస్ట్రిబూటింగ్ సంస్థ ప్రైమ్ మీడియా వారు తెలియజేస్తున్నారు.

ప్రీమియర్స్ షో టైం మరియు సినిమా రన్ టైం సహా థియేటర్స్ కూడా అన్నీ లాక్ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. అలాగే బుకింగ్స్ కూడా త్వరలోనే తెరవనున్నట్టు తెలియజేసారు. ఆల్ మోస్ట్ అన్ని ప్రముఖ సిటీలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఇక ఈ సినిమాకి సంగీతం మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :