రీ రిలీజ్ కి రెడీ అవుతున్న అల్లు అర్జున్ “దేశముదురు”

Published on Mar 10, 2023 7:00 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరో ల చిత్రాలు రీ రిలీజ్ ను చేస్తూ, ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ అయిన దేశముదురు చిత్రం రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8, 2023 న ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హన్సిక హీరోయిన్ గా నటించగా, చక్రి సంగీతం అందించారు. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రం తో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :