“భీమ్లా నాయక్” లేటెస్ట్ ప్రోమోకి సర్వం సిద్ధం.!

Published on Oct 13, 2021 7:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి మ్యూజిక్ కూడా పెద్ద హిట్ గా మారినట్టు ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ చెబుతుంది.. పవన్ పై డిజైన్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ తో ఇప్పటికీ అదే హవా కొనసాగిస్తుంది.

ఇక మళ్లీ ఆలస్యం చెయ్యకుండా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో పాటను కూడా రెడీ చేసేయగా ఇప్పుడు దీని ప్రోమో కి సంబంధించిన అన్ని పనులు ముగిసినట్లేనని తెలుస్తోంది. ఆల్రెడీ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను త్రివిక్రమ్ కి వినిపించగా మరో పెద్ద హిట్ అవుతుంది అని వారు తెలిపారని శాస్త్రి ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. సంగీత దర్శకుడు థమన్ కూడా దీనిపై ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. అయితే ఈ ప్రోమో ఈరోజు కానీ రేపు కానీ విడుదల అవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మాత్రం దీనికి కూడా భారీ రికార్డులు ఇవ్వాలని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :