మోస్ట్ పవర్ఫుల్ “అన్ స్టాప్పబుల్” ఎపిసోడ్ కి రంగం సిద్ధం.!

మోస్ట్ పవర్ఫుల్ “అన్ స్టాప్పబుల్” ఎపిసోడ్ కి రంగం సిద్ధం.!

Published on Dec 27, 2022 1:00 PM IST

డిజిటల్ హిస్టరీ లో రీజనల్ గా వచ్చి సూపర్ సక్సెస్ అయ్యిన ఓటిటి ప్లాట్ ఫామ్ ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు ఓటిటి యాప్ “ఆహా” అని చెప్పాలి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ తెలుగులో సాలిడ్ కంటెంట్ ఇస్తూ దూసుకెళ్తున్న ఈ షో లో అయితే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తో “అన్ స్టాప్పబుల్” అనే క్రేజీ టాక్ షో ని అయితే చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ టాక్ షో ఇండియా లోనే బెస్ట్ టాక్ షో గా ఓటిటి లో అదరగొట్టగా నెక్స్ట్ ఇప్పుడు రెండో సీజన్లో కూడా అంతకు మించి భారీ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. ఇక ఆల్రెడీ ఈసారి ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మేకర్స్ ఓ సెన్సేషనల్ ఎపిసోడ్ ప్లాన్ చేయగా ఇది త్వరలో స్ట్రీమింగ్ కి రానుంది. ఇక ఇదే పెద్ద సెన్సేషన్ అనుకుంటే నెక్స్ట్ దీనికి మించి అయితే ‘పవర్ఫుల్’ ఎపిసోడ్ ని మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాలయ్య లతో అనౌన్స్ చేయగా ఇపుడు అంతా దీనివైపు చూస్తున్నారు.

మరి ఇప్పుడు అయితే ఈ క్రేజీ ఎపిసోడ్ ఈరోజు స్టార్ట్ అయ్యిపోయినట్టుగా కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, ఫ్యాన్స్ చేతికి కొన్ని బ్యాండ్స్ కట్టుకొని ఉండగా స్టేజ్ పై అయితే ఎన్ బి కె * పి ఎస్ పి కే అంటూ ఓ డిజైన్ కూడా కనిపిస్తుంది. దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఎగ్జైటింగ్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు