‘జాగ్వర్’ ఆడియో లాంచ్ కు రంగం సిద్ధం

jaguaar
దర్శకుడు మహాదేవ్ దర్శకత్వంలో మాజీ ప్రధాని దేవ గౌడ మనువడు నిఖిల్ గౌడ హీరోగా పరిచయం అవుతూ చేసిన చిత్రం ‘జాగ్వార్’. ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 6 దసరా కానుకగా విడుదలవుతుండగా చిత్రా ఆడియో వేడుక రేపు హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో అంగరంగ వైభవంగా జరుగనుంది.

నిఖిల్ గౌడ తండ్రి కుమార్ స్వామి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యే అవకాశముంది. ఇకపోతే ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జగపతి బాబు, రమ్య కృష్ణ, బ్రహ్మాంనందం వంటి ప్రముఖ నటులు నటించగా హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ఓ సాంగ్ లో ఆడి పాడనుంది.