‘జాగ్వార్’ ఆడియో లాంచ్ : పవన్ కోసం భారీ ఏర్పాట్లు!

jagvar

మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో ‘జాగ్వార్’ అనే ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సుమారు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని నోవాటెల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. నిఖిల్ తండ్రి కుమారస్వామి కోరిక మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానుండడంతో జాగ్వార్ ఆడియో కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ హాజరు కానుండడంతో ఆడియో లాంచ్ నిర్వాహకుల ఆయన కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు హాజరు కానుండడంతో అందుకు తగ్గట్టుగా భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్నా ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుండడం ఈ సినిమాకు అంచనాలను పెంచింది.