కళ్యాణ్ రామ్ “అమిగోస్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం!

కళ్యాణ్ రామ్ “అమిగోస్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం!

Published on Feb 5, 2023 11:13 AM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ అమిగోస్. ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. బింబిసార చిత్రం సూపర్ సక్సెస్ తో దూసుకు పోతున్న కళ్యాణ్ రామ్, అమిగోస్ చిత్రం తో అదే దూకుడు కొనసాగించాలని చూస్తున్నారు. అమిగోస్ చిత్రం ట్రైలర్ కి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ రాగా, నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుక లో ఏం మాట్లాడుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు