“కేజీయఫ్ 1” రీరిలీజ్ కి సర్వం సిద్ధం.!

Published on Apr 6, 2022 9:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమాకి ఉన్న ఈ క్రేజ్ నిమిత్తం ఆడియెన్స్ మరింత హైప్ పెంచేందుకు గత కొన్ని రోజులు కితమే ఈ సినిమా మొదటి భాగం చాప్టర్ 1 ని దేశ వ్యాప్తంగా తక్కువ టికెట్ ధరలతో మళ్ళీ రిలీజ్ చేస్తునట్టు అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు ఈ రిలీజ్ కి సర్వం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

ఈరోజు నుంచి బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయట. మరి అప్పుడు థియేటర్స్ లో మిస్ అయ్యినవారు అయితే ఇప్పుడు ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై విట్నెస్ చెయ్యొచ్చు. ఈ సినిమా థియేటర్స్ లో ఈ ఏప్రిల్ 13 వరకు ఉండగా 14న చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.

సంబంధిత సమాచారం :