“ఎన్టీఆర్ 30” అప్పటికి సర్వం సిద్ధం.!

“ఎన్టీఆర్ 30” అప్పటికి సర్వం సిద్ధం.!

Published on Dec 23, 2022 10:00 AM IST

టాలీవుడ్ లో ఉన్న మాస్ క్రౌడ్ పుల్లర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కోసం అందరికీ తెలిసిందే. మరి తారక్ అయితే హీరోగా ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియా సినిమాని తన కెరీర్ లో 30వ ప్రాజెక్ట్ గా చేయనున్నారు. ఇక దీని నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సెన్సేషన్ గా మారుతుంది. ఇక ఇప్పుడు మ్యూజికల్ వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతూ ఉండగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ అయితే సినిమాపై ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

మేకర్స్ అయితే ఈ చిత్రానికి సంక్రాంతికి ముహూర్తం కుదిర్చారట. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమా మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనితో అయితే ఈ అవైటెడ్ సినిమా మొదలు కి సర్వం సిద్ధం అయ్యినట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు