పవన్ పవర్ఫుల్ ఎపిసోడ్ కి సర్వం సిద్ధం.!

Published on Feb 2, 2023 10:59 am IST

ప్రస్తుతం ఓటిటి వీక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ అండ్ పవర్ ఫుల్ ఎపిసోడ్ ఏదన్నా ఉంది అంటే అది నందమూరి నటసింహం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మాసివ్ అన్ స్టాప్పబుల్ పవర్ ఎపిసోడ్ కోసం అని చెప్పాలి. మరి ఈ సాలిడ్ ఎపిసోడ్ లో మొదటి పార్ట్ ఈరోజు స్ట్రీమింగ్ కి రాబోతుండగా ఈ ఎపిసోడ్ కోసం అయితే ఆహా యూనిట్ అంతా సిద్ధం చేసినట్టుగా కూడా వెల్లడించారు.

అలాగే ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో మరిన్ని ప్రమోషన్స్ ని ఈ ఎపిసోడ్ కోసం చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ ఉంటుందనే అంచనా తో తమ యాప్ లో పలు మార్పులు చేశామని కూడా తెలిపారు. పవన్ ఫ్యాన్స్ కూడా గడియారంలో సమయం చూసుకుంటున్నారు. ఇక ఈ అవైటెడ్ ఎపిసోడ్ అయితే ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :