“పొన్నియన్ సెల్వన్ 1” టీజర్ కి ఆల్ సెట్.!

Published on Jul 7, 2022 9:00 am IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రాలు భారీ స్పందనను అందుకుంటున్న వేళ తమిళ ఇండస్ట్రీ నుంచి భారీ స్థాయి అంచనాలు మరియు బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “పొన్నియన్ సెల్వన్” కూడా ఒకటి. దర్శకుడు మణిరత్నం బ్రాండ్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ గానే వెళ్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఒకో పాత్ర పోస్టర్ ను ఇప్పుడు రిలీజ్ చేస్తూ కూడా వస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ కి అంతా సిద్ధం అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ అవైటెడ్ టీజర్ ని ఈ జూలై 8న చెన్నైలో ఓ గ్రాండ్ ఈవెంట్ తో లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. చోళ సామ్రాజ్య నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తుండగా కార్తీ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడెక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :