రష్యాలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన “పుష్ప”.!

రష్యాలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన “పుష్ప”.!

Published on Dec 8, 2022 9:20 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “పుష్ప” నేషనల్ వైడ్ ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేసిందో తెలిసిందే. దీనితో గత ఏడాది టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక తర్వాత పుష్ప మ్యానరిజంలు అలాగే సినిమాలో పాటలు మరింత పెద్ద హిట్ అయ్యాయి. ఇక ఇలా ఈ చిత్రం అయితే ఫైనల్ గా రష్యా భాషలో డబ్ అయ్యి అక్కడ కూడా చిత్ర మేజర్ యూనిట్ అంతా కూడా హాజరయ్యి గట్టి ప్రమోషన్స్ చేయగా ఈరోజు అయితే ఫైనల్ గా రష్యా లో గ్రాండ్ రిలీజ్ అయితే అయ్యింది.

మరి ప్రస్తుత టాక్ తో అయితే అక్కడ కూడా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ అందుకుంటుందని అంటున్నారు. మరి ఈ సినిమా అక్కడెలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ నెక్స్ట్ అయితే పుష్ప 2 షూట్ ని స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు