“RRR” బ్లాస్టింగ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం అట.!

“RRR” బ్లాస్టింగ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం అట.!

Published on Dec 19, 2021 8:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర ది మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా “రౌద్రం రణం రుధిరం” ఒకటి. నెక్స్ట్ లెవెల్ అంచనాలు నెలకొల్పుకున్న చిత్రం ఇప్పుడు సాలిడ్ ప్రమోషన్స్ తో సిద్ధం అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ కే రాజమౌళి అన్ని భాషల్లో కూడా కీలక ప్రెస్ మీట్ లు పెట్టారు.

ఇక ఇప్పుడు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రంగం సిద్ధం చెయ్యగా వాటిలో మొదటగా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ తోనే స్టార్ట్ చేసారు. కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేసిన ఈవెంట్ బ్లాస్ట్ కి ఇప్పుడు సర్వం సిద్ధం అయ్యినట్టుగా చిత్ర యూనిట్ తెలుపుతున్నారు. RRR రోర్ ముంబై లో వినిపిస్తున్నామని రెడీగా ఉండమని చెప్తున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ ఫస్ట్ ఈవెంట్ ఎలా ఉంటుందో సాయంత్రం వరకు ఆగి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు