సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.!

Published on Sep 14, 2023 8:00 am IST

మన సౌత్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ టాలెంటెడ్ అండ్ నాచురల్ నటి అయినటువంటి సాయి పల్లవి చాలా పకట్బందీగా తన సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది అని తెలిసిందే. అందుకే ఆమెకి భారీ డిమాండ్ ఉన్నప్పటికీ తక్కువ సినిమాల్లోనే కనిస్తుంది. మరి అలా సౌత్ లో తెలుగు సహా తమిళ్ మళయాళ భాషల్లో రాణించిన తాను ఇప్పుడు ఫైనల్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయినట్టుగా బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

మరి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సాయి పల్లవి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో హీరోయిన్ గా దర్శకుడు సునీల్ పాండే కాంబినేషన్ లో చేసే సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నట్టుగా తెలుపుతున్నారు. దీనితో ఈ సినిమాతో అయితే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది అని చెప్పాలి. మరి సాయి పల్లవి నటనకి మెయిన్ గా డాన్స్ కి అక్కడ ఎంతమంది ఆడియెన్స్ మెస్మరైజ్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :