శంకర్ – చరణ్ ల భారీ ప్రాజెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్ కి ఆల్ సెట్.!

Published on May 1, 2022 10:00 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ జేమ్స్ కేమరూన్ తో అని అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ సినిమాని శంకర్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. తన కెరీర్ లో మరో సాలిడ్ సోషల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా పంజాబ్ లో కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. అయితే ఈ షెడ్యూల్ అనంతరం ఇప్పుడు ఇంకో కీలక షెడ్యూల్ కి సిద్ధం తెలుస్తుంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ మే 5 నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ విశాఖపట్నంలో స్టార్ట్ కాబోతుందట. నిజానికి ఈ షెడ్యూల్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉంది కాస్త లేట్ అయ్యింది. ఇందులో పలు కీలక సన్నివేశాలు శంకర్ తెరకెక్కించనున్నారట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో తమ బ్యానర్ లో 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :