ఆ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది..!

multi
‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘జెంటిల్‌మేన్’ తదితర సినిమాలతో దర్శకుడిగా ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ, తాజాగా ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో ఆయన ఈ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 1న పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని సమాచారం. ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కేసీ నరసింహరావు నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.